గన్నవరంలో తప్పిన పెను ప్రమాదం
కృష్ణా: లారీ బస్సును ఢీకొట్టిన ఘటన గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో జరిగింది. జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న లారీని తప్పించబోయే క్రమంలో లారీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్లో నుంచి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి అమలాపురం వెళ్తున్న ఈ బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.