10వ తరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ

10వ తరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ

CTR: పులిచెర్ల మండలం కల్లూరు, మండలంపేట జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్ష కేంద్రాలను తిరుపతి డీవైఈవో ఇందిరాదేవి శనివారం పరిశీలించారు. ఈ మేరకు ఆమె పరీక్ష గదులు, ఇతర సౌకర్యాలపై హెచ్ఎంలు శ్రీవాణి, ఫజురుల్లాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పోకల తాతయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.