పారాధి గ్రామ సచివాలయంలో తనిఖీలు
VZM: బొబ్బిలి మండలంలోని పారాధి గ్రామ సచివాలయాన్ని సోమవారం ఎంపీడీవో రవికుమార్ తనిఖీ చేశారు. కార్యాలయంలో నమోదులు, సేవల అమలు, హాజరు పట్టికలు పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఇన్‌ఛార్జి డిప్యూటీ ఎంపీడీవో కృష్ణమ్మ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.