ముఖ్యమంత్రి పర్యటనకు మూడంచెల భద్రత: SP
ADB: ముఖ్యమంత్రి పర్యటనకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలో పోలీసు యంత్రాంగంతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. 700 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎవరికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో వారే పార్కింగ్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించాలని సూచించారు.