జైతవరంలో హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన

AKP: చీడికాడ మండలం జైతవరంలో శుక్రవారం మహిళా సంరక్షణ కార్యదర్శి సుధారాణి ఆధ్వర్యంలో హెచ్ఐవీ, మత్తు పదార్ధాల వినియోగంపై అవగాహన కల్పించారు. మత్తు పదార్ధాల వలన యువకుల జీవితాలు నాశనమవుతున్నాయని, కావున మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ పట్ల జాగ్రత్తలు పాటించాలని, వీటిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.