ఇది ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి: హరీష్

ఇది ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి: హరీష్

TG: గజ్వేల్ MLA క్యాంప్ ఆఫీస్‌పై దాడి బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. KCR క్యాంప్ ఆఫీస్‌లో కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ ఆదేశాలతో జరిగిన దాడి అని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందన్నారు.