VIDEO: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
CTR: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ శిరీష దేవి హెచ్చరించారు. కార్వేటి నగరంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. బెల్ట్ షాపులు నిర్వహించే వారి సమాచారం ఎక్సైజ్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. కొందరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎక్సైజ్ సిబ్బందిపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.