రెండు బాధ్యతలతో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లోపం

NLG: విద్యాశాఖలో రెగ్యులర్ MEOలు లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. చాలా ఏళ్లుగా HMలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు రెండు బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో దేనిపైనా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ MEOలను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.