అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

JGL: మెట్పల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలం దృష్ట్యా మండలంలో చాలా గ్రామాలకు భగీరథ నీళ్లు అందడం లేవని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు.