భక్తులు మోసపోవద్దు.. టీటీడీ ఛైర్మన్
AP: టీటీడీ ఛైర్మన్ BR నాయుడు భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. కొందరు వ్యక్తులు మోసపూరిత చర్యలతో భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దని కోరారు. కేవలం అధికారిక మార్గాల ద్వారానే తమ కానుకలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.