'అఖండ 2' విజయం కోసం పూజలు
సత్యసాయి: 'అఖండ 2' చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు జి. మధు ఆధ్వర్యంలో కదిరిలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామికి 110 టెంకాయలు సమర్పించారు. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సినిమా విజయం కోసం మొక్కుకున్నారు.