బాపట్ల: పాము కాటుతో చిన్నారి మృతి

బాపట్ల: పాము కాటుతో చిన్నారి మృతి

గుంటూరు: పిట్టలవానిపాలెం మండలంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఖాజీపాలెం గ్రామ పంచాయతీ ఎస్టీ కాలనీలో పాము కాటుకు గురై 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.