'నానో ఎరువులపై అవగాహన కల్పించాలి'

'నానో ఎరువులపై అవగాహన కల్పించాలి'

NTR: నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.జీ.లక్ష్మీశ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను ఆయన సందర్శించారు. నానో యూరియా, డీఏపీ, జింక్, కాపర్ తదితర ఎరువుల ప్రయోజనాలపై అవగాహన పెంచాలన్నారు. కిసాన్ డ్రోన్ స్ప్రే విధానాన్ని పరిశీలించారు. మార్క్‌ఫెడ్ సేవలు రైతుల సాధికారతకు తోడ్పడాలన్నారు.