'బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలి'
JN: వల్మిడి గ్రామంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సమన్వయంతో పని చేయాలని సూచించారు.