'సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి'

NLG: ఈనెల 25న ఇందిరా పార్కు వద్ద జరిగే సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలకు ముందే బిసి రిజర్వేషన్లను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. నల్గొండలో బుధవారం వారు సత్యాగ్రహ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.