విషాదం.. వరికోత మిషన్ ఢీకొని బాలుడు మృతి

TG: మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని వరికోత మిషన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.