ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి-గన్నారం మధ్య ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా..ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.