సూర్య 'కరుప్పు' రిలీజ్‌పై లేటెస్ట్ బజ్
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'కరుప్పు'. తాజాగా ఈ సినిమా విడుదలపై లేటెస్ట్ బజ్ నెలకొంది. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూడగా.. ఆ సమయంలో పలు సినిమాలు విడుదల కానుండటంతో వారం గ్యాప్ ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయించారట.