పాతబస్తీ డ్రగ్స్, లైంగిక దాడులు.. బండి సంజయ్ ఫైర్!
HYD: నగరంలోని పాతబస్తీలో మైనర్ బాలికలపై డ్రగ్స్, లైంగిక దాడుల ఘటనలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బాలికలను 'అజీజ్' నేతృత్వంలోని గ్యాంగ్ డ్రగ్స్‌ను అలవాటు చేసిందని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు, తల్లిదండ్రుల వాంగ్మూలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సంజయ్ ట్వీట్‌లో ఖండించారు.