బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య
MBNR: భూత్పూర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెల్కిచర్ల గ్రామానికి చెందిన జంగమ్మ (42) అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు జ్యోతి (15), శైలజ (13)లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి 3 పిల్లలను తీసుకుని పొలం వద్దకు వెళ్లి, ముందుగా ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి, ఆపై తాను దూకేసింది. అదృష్టవశాత్తూ ఆమె కుమారుడు తప్పించుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.