క్రీడలతోనే మానసిక ప్రశాంతత: సీఐ

క్రీడలతోనే మానసిక ప్రశాంతత: సీఐ

SRPT: యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని గ్రామీణ సీఐ జీ.రాజశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం పెన్‌పహాడ్ మండలం భక్తుల్లాపురంలో చైతన్య వేదిక ఆధ్వర్యంలో షటిల్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని పేర్కొన్నారు. కష్టపడి చదువుకుని సమాజానికి పేరు తీసుకురావాలని యువతకు హితవు పలికారు.