ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కృష్ణా: మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రొండి కృష్ణ పాల్గొని భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను మరింత వైభవోపేతంగా చేశారు.