అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
PPM: పార్వతీపురం మండలం, కొత్తఊరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గిరిజన వ్యక్తైన భాస్కరరావు మద్యానికి భనిసయ్యాడు. దీంతో ఓ స్వచ్ఛంద సంస్థ వ్యసనం నుంచి దూరం చేస్తామని అతడిని సంస్థ సభ్యులు తీసుకెళ్లారు. 3 రోజుల క్రితం వారితో వెళ్లిన భాస్కర్ హఠాత్తుగా మృతి చెందాడన్న వార్త కుటుంబ సభ్యులను కుదిపివేసింది. వ్యక్తి మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.