'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'
ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు రహదారిలో ఎస్సై కే మాధవరావు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక సీట్లో కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని, లేకుంటే రూ.1000లు జరిమానా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.