VIDEO: 'కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి'
అన్నమయ్య: గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నమయ్య జిల్లా అంగన్‌వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ డిమాండ్ చేశారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రాయచోటి ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో అంగన్‌వాడీ వర్కర్లు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వేతనాలు పెంచాలన్నారు.