ఆదివాసీలకు అండగా ఉంటాం: మంత్రి

VZM: ఆదివాసీలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గిరిజన ప్రాంతాలకు రహదారుల అభివృద్ధికి 10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఇప్పటికే పంపడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా విడిపోయిన తర్వాత ITDA వేరయ్యిందన్నారు.