పల్టీ కొట్టిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

KMM: ముదిగొండ సమీపంలోని ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు ముందు టైర్లు ఒక్కసారిగా పేలింది. దీంతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.