VIDEO: తడ్కల్‌లో ముస్లిం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

VIDEO: తడ్కల్‌లో ముస్లిం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

SRD: కంగ్టి మండల తడ్కల్‌ గ్రామంలో ముస్లింలు శాంతిర్యాలీ నిర్వహించారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 27మంది పర్యాటకులను క్రూరంగా చంపినందుకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆదివారం రాత్రి గ్రామంలో ముస్లింలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీతో మృతులకు నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.