'రెండవ విడత ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి'
SDPT: రెండవ విడతలో జిల్లాలో 10 మండలాల్లో 182 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఆర్డీవో, ఎంపీడీవో, ఎంపీవో, తహసిల్దార్‌లు ఇతర అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. అధికారులకు ఎలక్షన్ ప్రక్రియ గురించి దిశానిర్దేశం చేశారు.