VIDEO: శాతవాహన కాలం టెర్రకోట శిల్పం తల గుర్తింపు
HNK: కమలాపూర్ మండలం శనిగరంలో శాతవాహనుల కాలానికి చెందిన అరుదైన టెర్రకోట యక్షిణి శిల్పం తల లభ్యమైంది. వాగు పరీవాహక ప్రాంతంలోని గట్టుమల్లు రైతు పొలంలో సుమారు 2వేల ఏళ్ల నాటి ఈ ఆనవాళ్లు గుర్తించారు. ఈ శిల్పం నాటి కళా సంపదకు నిదర్శనంగా నిలిచిందని చరిత్ర పరిశోధకులు పేర్కొన్నారు. పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే మరిన్ని చారిత్రక విశేషాలు వెలుగులోకి వస్తాయి.