దంచికొడుతున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
MDK: మార్చి నెల మొదటి వారంలోనే జిల్లాలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎక్కువ నీరు తాగాలని సూచిస్తున్నారు.