VIDEO: అధికారులపై మంత్రి పార్థసారథి ఆగ్రహం
ELR: రైతు సేవా కేంద్రాల్లో అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర మంత్రి పార్థసారథి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్ర అధికారులు, ప్రైవేట్ ధాన్యం కొనుగోలు దారులతో చేతులు కలిపి రైతులను మోసం చేస్తున్నారని రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.