భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

SRD: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ప్రకటనలో తెలిపారు. చెరువులు వాగులు పొంగిపొర్లుతున్నందున అటువైపు వెళ్ళవద్దని సూచించారు. రోడ్లపైకి వర్షం నీరు రావడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలను మూసివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.