హుస్నాబాద్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
SDPT: హుస్నాబాద్‌లో ఇవాళ ప్రయాణికులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. లైసెన్స్ లేని వారు వెంటనే పొందాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడరాదన్నారు.