రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన

కృష్ణా::ఎస్‌ఐలు షేక్ ఫెరోజ్, ఉషారాణి ఈరోజు పెనమలూరు సెంటర్‌లో ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు.హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం అవసరం గురించి, వేగవంతమైన డ్రైవింగ్, ప్రమాదకరమైన ఓవర్‌టేకింగ్ వంటి చర్యల వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు.