వెల్గటూర్ గురుకులాన్ని సందర్శించిన మంత్రి
JGL: ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల నమ్మకం రోజురోజుకీ పెరుగుతోందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా వెల్గటూర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం కూడా అందిస్తామని అన్నారు.