యూపీఎస్సీ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ప్రోత్సాహం
NLR: యూపీఎస్సీ పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.