VIDEO: పత్తి లోడ్ వాహనం బోల్తా
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా వద్ద ఆదివారం పత్తి లోడ్ నిండిన టాటా ఏసీ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రాణ నష్టం జరుగలేదు. వాహనం వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే చేరి వాహనాన్ని రోడ్డు నుంచి తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.