'సర్వేను పకడ్బందీగా జరపాలి'

'సర్వేను పకడ్బందీగా జరపాలి'

VZM: బంగారు కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని గంట్యాడ ఎంపీపీ హేమావతి అన్నారు. శుక్రవారం గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో బంగారు కుటుంబంపై ప్రత్యేక సమావేశం జరిగింది. అర్హులైన కుటుంబాలు జాబితా ఖచ్చితంగా తయారు చేయాలని సూచించారు. గ్రామసభలు జరిపి ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు.