రిలయన్స్‌ పవర్‌పై ఈడీ ఆకస్మిక దాడులు

రిలయన్స్‌ పవర్‌పై ఈడీ ఆకస్మిక దాడులు

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. రిలయన్స్ పవర్‌తో పాటు దాని అనుబంధ సంస్ధలపై ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది. నగదు అక్రమ  చలామణి కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఈడీ అధికారిక ప్రకటనను విడుదలు చేసే అవకాశం ఉంది.