వైద్యుల నిర్లక్ష్యం.. విద్యార్థి బొటనవేలు తొలగింపు

వైద్యుల నిర్లక్ష్యం.. విద్యార్థి బొటనవేలు తొలగింపు

MDK: కంగ్టి మండలం తుకారం తండాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 9వ తరగతి విద్యార్థి సురేష్ జీవితంలో తీరని లోటు ఏర్పడింది. ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి ఇన్ఫెక్షన్ సోకడంతో, వైద్యులు అతని ఎడమ చేతి బొటనవేలును తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటనపై బీజేపీ, బీఎస్పీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.