తాగునీటికి ఇబ్బందులు

తాగునీటికి ఇబ్బందులు

SKLM: జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో తాగునీటి ఎద్దడి పరిష్కారానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏషియన్‌ సమీకృత మౌలిక వసతుల కల్పన బ్యాంకు (ఏఐఐబీ) రుణం మంజూరు చేసింది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో టీడీపీ ప్రభుత్వం పనులు చేపట్టలేకపోయింది. ఆ తరువాత ఏర్పడిన గత ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.