'నేటితరానికి స్ఫూర్తిప్రదాత మండలి వెంకట కృష్ణారావు'
కృష్ణా: నేటితరానికి స్ఫూర్తిప్రదాత మండలి వెంకట కృష్ణారావు అని టీడీపీ సీనియర్ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ వంతెన సెంటరులో ఉమ్మడి రాష్ట్ర మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి నిర్వహించారు. కృష్ణారావు విగ్రహానికి బోస్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా) నివాళులు అర్పించారు.