మంత్రి నారాయణను కలిసిన ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి

మంత్రి నారాయణను కలిసిన ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి

NLR: మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో ఆయన‌ను ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకి పదవి రావడానికి సహకరించిన మంత్రి నారాయణను ఆమె ఘనంగా సత్కరించారు. పుష్ప గుచ్చం అందజేశారు. ఎన్నికల సమయంలో పొంగూరు రమాదేవితో కలిసి గునుకుల విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి నారాయణ గెలుపునకు ఆమె కృషి చేశారు.