ర్యాగింగ్ కు పాల్పడిన 16 మంది విద్యార్థులు సస్పెండ్
ఏలూరు వైద్య కళాశాలలో 3 సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ సావిత్రి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన జూనియర్, సీనియర్స్ మధ్య ఘర్షణపై బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు తీసుకొని విచారణ జరిపి 16 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.