నేటి నుంచి గాలిగుంట నివారణ టీకాలు ప్రారంభం
SRCL: జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను మంగళవారం నుంచి వేయను న్నట్లు జిల్లా పశువైద్యాధికారి వి.రవీందర్ రెడ్డి తెలిపారు. జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 13 మండలాల్లో ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తామన్నారు. చందుర్తి(M) మర్రిగడ్డలో కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.