VIDEO: సివిల్ సప్లై దాడులు.. 4 సిలిండర్లు సీజ్
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని విజయ టిఫిన్ సెంటర్‌లో సివిల్ సప్లై అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌గా ఉపయోగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారి లచ్చు నాయక్ హెచ్చరించారు.