మంత్రిని కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే

NDL: శ్రీశైలం పర్యటనకు వచ్చిన మంత్రి సంధ్యారాణిని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బుధవారం దేవస్థానం అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని చెంచు గిరిజనుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి స్పందిస్తూ.. వెంటనే సమస్యల పట్ల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.