VIDEO: స్వర్ణ రధంపై ఏకదంతుడి విహారం
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిన్న రాత్రి శ్రీ బుద్ధి సిద్ది సమేత స్వర్ణ రథంపై ఆలయ మాడవీధుల్లో విహరించారు. కాణిపాకం ఆలయంలో ఉదయం సంకటహర గణపతి వ్రతం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రిపూట స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ దంపతులు, ఎస్పీ రాజశేఖర్ రాజు, ఈఈ వెంకటనారాయణ పాల్గొన్నారు.