11వ రోజుకు చేరిన 'టిట్టిభ సత్యాగ్రహం'

11వ రోజుకు చేరిన 'టిట్టిభ సత్యాగ్రహం'

VSP: తెలుగుభాష రక్షణ కోసం తెలుగుదండు సారథ్యంలో ప్రారంభించిన "టిట్టిభ సత్యాగ్రహం గురువారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, సాహితీవేత్తలు, పురప్రముఖులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ.. పాలకులు భాషా సంస్కృతుల రక్షణకు ఆలోచన చేయరని విమర్శించారు.